undralla-tadde-nomu-significance

ఉండ్రాళ్ళ తద్దె

సెప్టెంబర్ 19వ తేదీ

ఉండ్రాళ్ళ తద్దె భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ రెండురోజుల పండుగ. ఇది మహిళల పండగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేదపండితులు అంటున్నారు. అలాగే పెళ్ళయిన ఆడపిల్లలు నోమును పెళ్ళయిన ఏడాది నుండే ప్రారంభించి, పడి సంవత్సారాలు నోచుకుంటారు. తమ భర్త, సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం లేనివారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోము నోచుకుంటారు. ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు ముద్దా, పసుపు కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వులనూనె వారికి ఇచ్చి, మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి.

విదియనాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నం గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారు. వివాహం కాని ఆడపిల్లలు ఆ రోజు తెల్లవారుఝామున తలంట పోసుకోవాలి. తలంటు అనగానే ఏదో షాంపూతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని దేదుతనం క్రిమికీటకాలని జుట్టులోకి రానివ్వదు. జుట్టులోని తడిని తరువాత మెత్తని టవల్ తో చుట్టుకోవాలి. తరువాత బాగా పీల్చుకునేలా చేసి సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి. దీంతో జుట్టు అంతజా సువాసనతో నిండిపోవడమే కాకుండా తల తడవడంతో జుట్టు మూలాల దగ్గర ఉన్న తడి పూర్తిగా ఆరిపోతుంది. ఇక ఉదయం ఆరు గంటలకు ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి.

రెండవ రోజు ఉండ్రాళ్ళ తద్దెలోని ప్రత్యేకత ఏమిటంటే తెల్లవారు ఝామునే భోజనాలు చేయడం. ఈ రోజు కూడా గోంగూర లేదా ఆవకాయ నంచుకుని పెరుగు అన్నం తిని అలసిపోయేవరకు దగుడుమూతలూ మొదలైన ఆటలు ఆడతారు. ముగ్గురి ఇళ్ళలో ఊయల ఊగుతారు. ఆటలు పూర్తయిన తరువాత ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉన్ద్రాల్లని వాళ్ళ కూతురికి ఇస్తే ఆ తల్లీ కూతురూ ఆ ఉండ్రాళ్ళని తల్లీ కూతుళ్ళకి ఇస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి, యా కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు.

మధ్యాహ్నం గౌరీ పూజ. గౌరీదేవిని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఐదు దారపు పోగులు, ఐదు ముడులు వేసో. ఏడు తోరాలను అమ్మవారి ప్రక్కనే పెట్టి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోము చేసుకున్న వారికి, మిగిలిన ఐదు, ఐదుగురు ముత్తైదువులకు పూజ తరువాత కట్టాలి. బియ్యపుపిండిలో బెల్లం కలిపి, పచ్చి చలిమిడి చేసి ఐదు ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి.

పూర్వం ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరచుకుంది. ఒక ఉండ్రాళ్ళ తద్దె రోజు, రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరాడు. ఆమె అహంకారంతో దైవ నిండా చేసి నోము చేయలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకుపోయారు. మహా వ్యాధి బారిన పడింది. తరువాత రాజ పురోహితుడి సలహాపై ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకుని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యవంతురలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి చేరుకుంది. అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గరవి తీసుకుని తలపై చల్లుకోవాలి. కొబ్బరికాయ కొట్టి, నైవేద్యాలు నివేదించాలి. ఈ కథలోని నీతి ఏమిటంటే గర్విష్టి అయిన వారికి ఇంతటి కఠినమైన శిక్షకు గురైంది కదా అందుకే సత్ప్రవర్తనతో నోము నోచినవారికి ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు. అందుకే సన్మార్గంలో నడవండి.

ఉండ్రాళ్ళ తద్దె నోము :

వివాహం అయిన సంవత్సరం వచ్చే ఉండ్రాళ్ళ తద్దె రోజున నోమును పట్టుకుంటారు. ముందురోజు గోరింటాకు పెట్టుకోవాలి. ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి గోంగూర పచ్చడితో భోజనం చేయాలి. తెల్లవారిన తరువాత స్నానం చేసి మూడు ఇళ్ళలో ఉయ్యాల ఊగాలి. గౌరీపూజ చేసి వాయనం ఇచ్చుకోవాలి. గౌరీపూజ పూర్తయిన తరువాత ఉండ్రాళ్ళ తద్దె వ్రతకథ చదవాలి. అక్షింతలు చేతిలో పెట్టుకుని, కథ పూర్తైన తరువాత అక్షింతలు అమ్మవారిపై వేసి అమ్మవారి పాదాల దగ్గరనుండి కొన్ని అక్షితలు తలపై చల్లుకోవాలి. ఒక పళ్ళెంలో ఐదు పూర్ణాలు లేకపోతే ఐదు ఉండ్రాళ్ళు, పండు తాంబూలం, ఐదు పోగుల తోరం, దక్షిణ వీటిని రెండు ప్లేట్లలో సర్థుకోవాలి. ఒకటి గౌరీదేవికి నైవేద్యం. తోరం చేతికి చుట్టుకుని ఎవరైనా ముత్తైదువ ఉంటే ఆమెకు వాయనం ఇవ్వవచ్చు లేకపోతే గౌరీదేవికి వాయనం ఎత్తి విడిచిపెట్టాలి. వాయనం ఇచ్చిన తరువాత ఇచ్చినవాళ్ళు తినకూడదు. వాయనం ఇచ్చిన తరువాత తోరం చేతికి చుట్టి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి.

నోము చెల్లించడం :

ఐదుగురు ముత్తైదువులను పిలుచుకోవాలి వారు ఆ రోజు తలస్నానం చేసి భోననానికి రావాలి. వాయనం ఆరు ప్లేట్లలో సర్థాలి. ఐదు పూర్ణాలు లేక మూడు పూర్ణాలు, రెండు గారెలు పెట్టవచ్చు. ఐదు పోగుల తోరం, ఒకటి వాయనం గౌరీదేవికి, పొంగలి, టెంకాయ, నైవేద్యం నివేదించి గౌరీదేవి షోడశోపేతంగా పూజ చేసి వ్రత కథ చదువుకుని అక్షింతలు మొత్తం గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్నవి తీసుకుని తలపై వేసుకోవాలి. పూజ పూర్తయిన తరువాత నైవేద్యం గౌరీదేవి దగ్గ్గర పెట్టిన ప్లేతులోని తోరం చేతికి కట్టుకుని ఇదుగురికి భోజనం వద్ధించిన తరువాత ఒక్కొక్కరికి ఒక వాయనం ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు, తీసుకునేటప్పుడు ...

ఇచ్చేవారు                                      తీసుకునేవారు

ఇస్తి వాయనం                              పుచ్చుకుంటి వాయనం

ఇస్తి వాయనం                             పుచ్చుకుంటి వాయనం

ముమ్మాటికి ఇస్తి వాయనం          ముమ్మాటికి పుచ్చుకుంటి వాయనం

వాయనం తీసుకున్నది ఎవరు      నేనే పార్వతిని

ఈ విధంగా ఐదుగురికి ఇవ్వాలి, అందరికీ తోరములు చేతికి చుట్టాలి, ముడి వేయకూడదు. బియ్యంపిండితో ముద్దతో కుందిలా చేసి దాంట్లో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి, ఐదుగురి విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి. అవి కొండెక్కిన తరువాత జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకునే ముత్తైదువ నెయ్యి వడ్డించిన తరువాత భోజనం చేయాలి. ఐదు పోగులకు పసుపు రాసి, మూడు చోట్ల పూలు ముడివేసి, రెండు చోట్ల ముడి వేసి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ నోము పట్టడానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కాని పట్టవచ్చు. ఇలా పడి సంవత్సరాలు చేసి ఉద్యాపన చెయ్యాలి.

Products related to this article

Designed  Bowl (Brass)

Designed Bowl (Brass)

Designed  Bowl (Brass)This bowl is made of bross which is used for decoartion prupose.The length of the bowl is : 15 Inchs Width of the Bowl : 7 Inchs Height of the Bowl : 9 Inchs ..

₹600.00

Black Sesame Seeds(250 Grams)

Black Sesame Seeds(250 Grams)

Black Sesame Seeds(250 Grams)..

₹75.00

Semi Precious Ruby Necklace Set (10 Layers)

Semi Precious Ruby Necklace Set (10 Layers)

Semi Precious Ruby Necklace Set Product Description:  Product: Necklace Set with Ear rings  Colour: Black  Metal: Glass & Pearl Necklace Length: 34 cm Earring..

₹1,500.00 ₹2,050.00

0 Comments To "undralla-tadde-nomu-significance"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!