ఏ ఆకులపై దీపాలు వెలిగించకూడదు ...?
నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో తమలపాకులపై కర్పూరం లేదా వత్తులు పెట్టి వెలిగించి వదలకూడదు. అలా వెలిగించినట్లయితే వారి ఇంట వారి కుటుంబ సభ్యుల ఇళ్ళలో దారిద్ర్యం తాండవిస్తుంది, సుఖసంతోషాలను కోల్పోయి, స్త్రీల శాపం, దైవ శాపం తగులుతుంది.
నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో బిల్వపత్రంపై దీపాలు వెలిగించి వదలకూడదు అలా వదిలినట్లయితే వెలిగించిన వారు పార్వతీదేవి, లక్ష్మీదేవి శాపానికి గురి అవుతారు.
నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో రావిచెట్టు ఆకుపై కర్పూరం లేదా వత్తి వెలిగించి వదలకూడదు. అలా వెలిగించినట్లయితే వంశవృద్ధి జరగదు.
నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో మఱ్ఱిచెట్టు ఆకుపై కర్పూరం లేదా వత్తులు పెట్టి వెలిగించి వదలకూడదు. అలా వెలిగించినట్లయితే త్రిమూర్తులైన (బ్రహ్మ విష్ణు మహేశ్వరుల) శాపానికి గురి అవుతారు. గురువు, శ్రీ మహాలక్ష్మీదేవి శాపానికి గురి అవుతారు.
నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో మోదుగ ఆకులపై కర్పూరం లేదా వత్తుల దీపం వెలిగించి వదలకూడదు. అలా వదిలినట్లయితే వాక్ దోషాలు (నత్తి, గ్రహణం మొర్రి) వస్తాయి.
నదిలో, సముద్రాలలో, సంగమ ప్రదేశాలలో నవగ్రహ ఆకులపై వత్తులు లేదా కర్పూరం పెట్టి దీపం వెలిగించి వదలకూడదు. అలా వెలిగించినట్లయితే నవగ్రహ దేవతల శాపం తగులుతుంది.
Note: HTML is not translated!