నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే ? సూచనలు ?
హిందూధర్మాన్ని అనుసరించి భక్తులు దేవీదేవతలకు వివిధ రకాల వత్తులు, దీపాలు వెలిగిస్తారు. ఆవునెయ్యి, నువ్వుల నూనె, అవిసె నూనె, గానుక నూనె, ఉసిరి దీపాలు, పిండి దీపాలు, ప్రమిద దీపాలు, కుందు దీపాలు ఇలా మొదలైన వాటితో దీపాలు వెలిగిస్తారు. నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కలిగే శుభ ఫలాలు మరియు నిమ్మకాయ దీపాలు వెలిగించకుండా ఉండడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. వాటి వివరాలు ఈ క్రింది విధంగా వివరించబడింది.
నిమ్మకాయలు శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవికి అత్యంత ప్రీతి. అందుకే నిమ్మకాయలతో శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవికి మాలగా అలంకరిస్తారు. గ్రామ దేవతలు అయిన ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ మొదలైన శక్తి స్వరూపాలకు నిమ్మకాయ దండలను అలంకరిస్తారు. దండలతో పాటు పార్వతీదేవి స్వరూపాలు భవానీ, కాళీమాత, దుర్గాదేవి, చౌడేశ్వరి, భద్రకాళి మొదలైన దేవాలయాలలో నిమ్మకాయల దీపం వెలిగిస్తారు.
పార్వతీదేవి ఆలయాలలో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవీ వారాలుగా తెలుపబడిన మంగళవారం, శుక్రవారాలలో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగిస్తారు. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 గంటల 12:00 గంటల వరకు ఉంటుంది. మంగళవారం రోజున దేవికి వెలిగించే నిమ్మకాయల దీపాలకన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మంగళవారం రోజు వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటే శుక్రవారం రోజున వెలిగించే నిమ్మకాయ దీపాలు సత్వగుణం కలిగి ఉంటాయి.
శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపం వెలిగించి, పెరుగు అన్నం, పెసరపప్పు, వడపప్పు, పానకం, మజ్జిగ, పళ్ళు ఏవైనా ఒకటి నైవేద్యంగా నివేదించిన తరువాత సుమంగళికి వాయనం ఇవ్వాలి. వీలయితే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, రవికెల ముక్క, చీర, దక్షిణ ఇచ్చి నమస్కారం చేసినట్లయితే తలచిన కార్యాలలో ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా శీఘ్రంగా, నిరాటంకంగా, శుభప్రదంగా నెరవేరతాయి.
ఎటువంటి పరిస్థితులలో అయినా ఇంటి లోపల నిమ్మకాయల దీపం వెలిగించకూడదు
ఎటువంటి పరిస్థితులలో అయినా ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు మహిళలు నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.
ఎటువంటి పరిస్థితులలో అయినా మహాలక్ష్మీ, సరస్వతి, ఇతర దేవాలయాలలో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. అలా వెలిగించినట్లయితే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు, దాంపత్య జీవితంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలలో నష్టం వాటిల్లడంతో పాటు ఇంట్లో అకాల మృత్యువు సంభవిస్తుంది. భార్యాభర్తల నడుమ, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు తీవ్రంగా ఉంటాయి.
నిమ్మకాయల దీపాలను వెలిగించే స్త్రీ పట్టుచీర ధరించి వెలిగిస్తే దేవీ అనుగ్రహం త్వరగా కలిగి అన్ని కార్యాలలో ఎటువంటి లోపాలు లేకుండా శీఘ్రంగా జరుగుతాయి. మామూలు చీరలు ధరించి వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి.
ఇంట్లో పండుగలు, పెద్దల తిథి కార్యాల రోజులలో, పిల్లల పుట్టిన రోజులు, పెళ్ళి రోజు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు.
ఎటువంటి పరిస్థితులలో అయినా ఇంట్లో రెండు దీపాలు వెలిగించకూడదు. నూనె దీపం, నిమ్మకాయ దీపం ఇలా వెలిగించకూడదు
ఇతర ప్రాంతాలు అంటే బంధువులు, మిత్రుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు, ఆడపిల్లలు, అక్క-చెల్లి ఇళ్ళకు వెళ్ళినప్పుడు, పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలను వారి ఇళ్ళలో వెలిగించకూడదు.
బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. స్త్రీలు నాలుగవ రోజున తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయా దీపాలను వెలిగించకూడదు అలాగే మైలుతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు.
Note: HTML is not translated!