తులసిదళాలను ఎక్కడ సమర్పించాలి …?
తులసి మహిమ అపారమైనది. తులసిమొక్క వున్న ఇంట్లో సర్వసౌభాగ్యాలూ వుంటాయి. సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి. తులసి దళాలతో ఎవరైతే రోజూ శ్రీమన్నారాయణులవరిని పూజిస్తారో వారికి సర్వ పాపములూ తొలగిపోతాయి. తులసిదళాలను రోజూ ఉదయం పూజా సమయంలోనే కోయవలెను. మిగిలిన ఏ వేళలయందునూ తులసీదళాలను తుంచరాదు. తులసీ దళాలను పురుషులు మాత్రమే త్రుంచవలెను. స్త్రీలు కోయరాదు. మంగళ, బుధ శుక్రవారాలలో తులసిని త్రుంచరాదు, అమావాస్య, పౌర్ణమి తిథులయందును, గ్రహణ సమయమందు, సంక్రమణ సమయములయందు తులసి పత్రములు కోయరాదు. తులసిని స్త్రీలు తలలో ధరించరాదు. అతి పవిత్రమైన తులసి సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం కనుక తులసి దళాలను శ్రీమన్నారాయణువారి పాదాలవద్దనే వుంచాలి. కానీ తలపై పెట్టకూడదు. తులసికి ప్రతిరోజూ నమస్కరించుట వలన సంతానప్రాప్తి, రోగనివారణ, దాస్య విముక్తి, సంఘంలో గౌరవం కలుగుతాయి.
Note: HTML is not translated!