వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి …?
హిందువులు ప్రతి ఒక్కరూ తమ తమ నివాసాలలో పూజగదిని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ పూజాదికాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు వాస్తు ప్రకారం పూజగదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో చాలామందికి తెలియదు. పూజగదిని ఈశాన్య, తూర్పు లేదా ఉత్తర దిక్కులలో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే తెల్లవారు ఝామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు కాబాట్టి. ఈ సమయంలో చేసే యోగ, ధ్యానం, పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు, సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి కాబట్టి పూజగదిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం లేకపోతే కనుక వంటగదిలో ఈశాన్య మూలలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి కానీ పడగ్గదిలో మాత్రం ఏర్పాటు చేసుకోకూడదు.
అలాగే విగ్రహాలను ఏ దిక్కున పెట్టుకోవాలి అనే సందేహం కలగడం కద్దు. విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కులలో పెట్టుకోవాలి. దీనికీ కారణం ఉంది అది ఏమిటంటే సూర్యకిరణాలు ఈశాన్యం, తూర్పు దిక్కులనుండి ప్రసరిస్తాయి కాబట్టి మరియు సాయంత్రం పూట పడమర నుంచి ప్రసరిస్తాయి కానీ విగ్రహాలను ఉత్తర దిక్కున పెట్టకూడదు ఎందుకంటే పూజించేవారు దక్షిణ దిక్కున కూర్చుని పూజ చేసుకోవలసి వస్తుంది అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణం వైపు, తల ఉత్తరం వైపు ఉంటాయి. దీనివల్ల శరీరంలోని ఉత్తర మూలం అయిన తల భూమి నుండి వచ్చే అయస్కాంత ఉత్తర ధృవాన్ని వికర్శిస్తాయి అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లేదా విరిగిపోయిన బొమ్మలను ఉంచకూడదు. విగ్రహాలను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా పెట్టకూడదు. పూజా సామాగ్రిని ఆగ్నేయ దిక్కున పెట్టుకోవాలి ఎందుకంటే అవి విగ్రహాలను, పూజ చేసేవారికి అడ్డు లేకుండా ఉంటాయి మరియు సూర్యకిరణాలు సవ్యంగా ప్రసరించకుండా అడ్డుపడవు.
పూజ గదికి లేత రంగులే వేసుకోవాలి అంటే తెలుపు, లేత పసుపు, లేత నీలం రంగులు వేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండడంతో భగవంతుడిపై దృష్టిని నిలపడం సులుభతరం అవుతుంది. పూజగదికి రెండు తలుపులు ఉండడం మేలు మరియు పూజగదికి తప్పనిసరిగా గడప ఉండాలి.
Note: HTML is not translated!