How many pradakshinas navagraha what mantra recite each graha

నవగ్రహాలకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? ఎవరికి ఏ మంత్రం చదవాలి?

మనుషుల పాపకర్మలు నవగ్రహ ప్రభావాలమీద ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసే సంయమలో తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. అయితే మొదటి ప్రదక్షిణం నుండి ఆఖరు ప్రదక్షిణం వరకు ఈ క్రింది శ్లోకాలను పఠించాలి.

'ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః' ... అంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి.

మొదటి ప్రదక్షిణ : జపాకుసుమాల వర్ణం కలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండల నాయకుడా, శ్రీ సూర్యభగవానుడా సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!

రెండవ ప్రదక్షిణ : కటకరాశికి అధిపతి అయిన చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం కలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా శ్రీ చంద్రభగవానుడా మమ్మల్ని కరుణించు!

మూడవ ప్రదక్షిణ : బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చికమేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు!

నాలుగవ ప్రదక్షిణ : నల్లని వర్ణం కలవాడా, కన్యామిథునరాశులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో నివసించేవాడా, శ్రీ బుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదవ ప్రదక్షిణ : అంగీరసగోత్రుడా, ధనుస్సుమీనారాశులకు అధిపతి, దేవగురువైన బృహస్పతీ, శ్రీ గురుభగవానుడా మాపై కరుణ చూపించు.

ఆరవ ప్రదక్షిణ : భార్గవగోత్రం కలవాడా, దైత్యగురువైన శ్రీ శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించువాడా మాపై కరుణావృష్టిని కురిపించు!

ఏడవ ప్రదక్షిణ : కాశ్యపగోత్ర్య్డా, కుంభమృగాశీర్షాలకు అధిపతి అయినవాడా, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీ శనైశ్చరుడా మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమదవ ప్రదక్షిణ : సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీ రాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు!

తొమ్మిదవ ప్రదక్షిణ : జైమినిగోత్రి కుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రరూపంతో ఉంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీ కేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!

0 Comments To "How many pradakshinas navagraha what mantra recite each graha"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!