Vanabhojanam-significance

వనభోజనాల విశిష్టత ?

కార్తీక మాసంలో స్నాన, జపతపాలు, అభిషేకాలు ఎంత ముఖ్యమో 'వనభోజనాలు' కూడా అంతే ముఖ్యం. వనం అంటే బ్రహ్మం, కాబట్టి బ్రహ్మాన్ని ఆరగించడం, అంటే శ్రీకృష్ణుడి లీలలను ఆస్వాదించడమే అమకోశంలో 'వనం' అనే పదానికి అరణ్యాన్ని ప్రమించడం అని అర్థం చెబుతుంది. పూర్వం కార్తీక పౌర్ణమి రోజున నైమిశారణ్యంలో సూతమహర్షి ఆధ్వర్యంలో మునులు అందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు అని కార్తీకపురాణంలో చెప్పబడింది. దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుండి కార్తీకమాసం మొదలవుతుంది. బంధువులు, స్నేహితులతో కలిసి దగ్గరలోని ఉద్యానవనాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరుడు అయిన శ్రీమన్నారాయణుడి విగ్రహం లేదా ఫోటో ప్రతిష్టించుకుని పూజ చేసిన తరువాత భోజనాలు చేయాలి. ఉసిరి ఔషధ ప్రాయమైనది కాబట్టి ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వనభోజనాలు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారాల్లో చేయాలి. ఈ రోజులలో కుదరని పక్షంలో మాసంలో ఏదో ఒక రోజున వనభోజనం చేయాలి.

0 Comments To "Vanabhojanam-significance"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!