కార్యసాధన మంత్రాల గురించి మీకు తెలుసా ?
నేటితరంలో అనుకున్న కార్యాలను నెరవేర్చుకోవడానికి మానవులు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వారు కోరుకున్న కార్య సాధనకు ఇక్కడ కొన్ని మంత్రాలను పొందుపరుస్తున్నాము వాటిని పఠించి కార్యసాధన సాధించగలరు.
ఇంట్లో నుండి బయటకు వెళుతున్న సమయంలో …
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజ కర్నికహ్శ్చ లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః !
ధూమ కేతు ర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః !
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః !!
ఈ శ్లోకాన్ని ఎటువంటి ముఖ్యమైన పనికోసం ఇంట్లో నుండి బయటకు వెళ్ళేముందు 16 సార్లు పఠించినట్లయితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా కార్యసిద్ధిని పొందుతారు.
సకల కార్యసిద్ధి కోసం ...
వక్రతుండాయ హుం
ఈ మంత్రాన్ని శుక్లపక్ష చవితిరోజున ప్రారంభించి లక్షసార్లు జపించిన తరువాత వినాయకుడికి అటుకులు, పాలు, పాయసం సమర్పించినట్లయితే ఎటువంటి విఘ్నాలు అయినా తొలగిపోయి సకల కార్యసిద్ధి సమకూరుతుంది.
ఆపదలు కలుగుతాయి అని సందేహం ఉన్నవారు …
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం !
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం !!
ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే ఆపదలు కలుగుతాయి అనే సందేహం ఉన్నవారికి ఆపదలు తొలగి క్షేమం కలుగుతుంది.
కార్యాలలో విజయం కోసం …
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే !
శరణ్యేత్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తుతే !!
అనుకున్న కార్యాలలో విజయం సాధించాలి అనుకునేవారు పై శ్లోకాన్ని 32 సార్లు పఠించాలి.
పనులలో ఆటంకాలు, పేచీలు అన్నప్పుడు …
నమోస్తురామాయ సలక్ష్మణాయ దేవ్యైచ తస్మై జనకాత్మజాయ !
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తుచంద్రార్క మరుద్గణేభ్యః !!
ఈ మంత్రం ఆంజనేయ కృత మంత్రం. కాబట్టి పనులలో ఆటంకాలు కానీ పేచీలు కానీ తొలగిపోవడానికి 15 సార్లు పఠించినట్లయితే అన్ని కార్యాలు ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా పూర్తవుతాయి.
పూజలు జపాలలో ఏకాంతం కోసం …
ఓంకార భావన స్థానంశంకరం దామతేజసాం !
శివంవందే వాసవాబ్జం భూనారాణసేవితం !!
పూజలు, జపాలు చేసే సమయంలో ఏకాంతం కుదరడానికి మరియు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ మంత్రాన్ని రోజూ 54 సార్లు పఠించాలి.
శతృవు నుండి ఆటంకాలు తొలగడానికి …
ఐం బీజ మాదిందు సమాన దీప్తిం హ్రీం సూర్యతేజోద్యుతి మద్వితీయం !
క్లీం మూర్తి వైశ్వానర తుల్య రూపం తృతీయ ద్యూనంతు శుభామానం !!
పైన పేర్కొన్న మంత్రాన్ని ప్రతిరోజూ 21 సార్లు అర్థరాత్రి సమయంలో పఠించినట్లయితే శతృ ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి సిద్ధిస్తుంది
ప్రజాదరణ పొందడానికి …
ఓం శ్రేం క్లీం గ్లౌం గం గణపతయే !
వరద వరద సర్వ జనంమే వసమానయ స్వాహా !!
ప్రజాదరణ పొందడానికి పైన పేర్కొన్న మంత్రాన్ని ఏ మంగళవారం రోజైనా ప్రారంభించి లక్ష సార్లు జపం చేసిన తరువాత మహాగణపతికి ఉండ్రాళ్ళు, చెరుకు ముక్కలు సమర్పించి ఎర్రగన్నేరు పూలతో పూజించినట్లయితే సంఘంలో ఉన్న కక్షలు కార్పణ్యాలు తొలగిపోయి ప్రసన్నులు అవుతారు. అలాగే మల్లెపూలను నేతిలో తడిపి హోమం చేసినట్లయితే గ్రామసభ, రాజ్యం వశమవుతాయి. దీనికి మించిన మంత్రం మరొకటి లేదు.
కుటుంబ కలహాలు తొలగిపోవడానికి, ఈతిబాధలు నుండి తప్పించుకోవడానికి, సుఖశాంతులు కలగడానికి …
సీతామనోమానస రాజహంస సంసార సంనాశహర క్షమాళో !
శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీ తారకబ్రహ్మ నమోనమస్తే !!
ఈ మంత్రాన్నిప్రతి రోజూ 108 సార్లు పఠించినట్లయితే కుటుంబంలో వచ్చే కలహాలు, ఈతిబాధలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
శత్రువులు మిత్రులుగా మారడానికి …
ఓం మణి ధరణీ వజ్రిణి శిఖరిణి !
సర్వవశంకరణి హుం ఫట్ స్వాహా !!
శత్రువులు మిత్రులుగా మారడానికి, సహాయపడడానికి ఈ మంత్రాన్ని శుద్ధ నవమి రోజున ప్రారంభించి 40 రోజులపాటు రోజుకి 2500 సార్లు పఠించినట్లయితే వృత్తిలోని వైషమ్యాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది. ప్రతి శుక్రవారం జపం చేసే సమయంలో దేవీ కుంకుమ పూజ తప్పనిసరిగా చేయాలి.
Note: HTML is not translated!