ఆలయాలలో అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు?
దేవాలయాలలో భక్తులు విగ్రహాలకు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. విగ్రహాలకు అభిషేకం చేయించినవారికి, చేసినవారికి కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణ వచనం. వివిధ రకాల పదార్థాలు, వస్తువులతో చేసే అభిషేకాల వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటే ...
- స్వర్ణాభిషేకం - సర్వాభీష్టాలు సిద్దించడంతో పాటు విశేషమైన లాభాలు చేకూరుతాయి.
- పంచామృతం - అష్టైశ్వర్యాలు సమకూరుతాయి.
- ఆవుపాలు - ఆరుర్థాయం పెరుగుతుంది
- ఆవుపెరుగు - సంతానవృద్ధి చేకూరుతుంది.
- సుగంధద్రవ్యాలతో - సమస్త సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.
- తేనె - సమస్త సుఖసంతోషాలు సంప్రాప్తిస్తాయి.
- విభూది - భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తాయి.
- చందనం - ఐశ్వర్యం చేకూరుతుంది.
- కలశ నీరు - సర్వకార్యాలు నిరాటంకంగా పూర్తవుతాయి.
- శంఖంలోని నీరు - శత్రుభయం నివారింపబడుతుంది.
- కొబ్బరిబోండాం - కుటుంబంలో కలహాలు ఉండవు.
- చెరుకురసం - సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
- నిమ్మరసం - పగ తీరుతుంది.
- అన్నం - రాజభోగాలు సమకూరుతాయి.
- పచ్చి బియ్యపుపిండి - ఋణబాధలు తొలగిపోతాయి.
- అరటిపండు - సుఖమయ జీవితం సంప్రాప్తిస్తుంది.
- మామిడిపండు - అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా, విజయవంతంగా స్వంతమవుతాయి