Devotional Articles
నాగుల చవితి విశిష్టత ఏమిటి ? | Nagula Chavithi
2024 | Nagula Panchami 2024 | Pooja Vidhanam in TeluguNovember 4th - నాగుల చవితిNovember 5th - నాగుల పంచమి నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగ పంచమి వస్తుంది. సుబ్రహ్మణ్య
స్వామిని ఆరాధించే భక్తులు.. ఈ రెండు రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య
స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు నిర్వహించడం మంచిది. నాగులకు.. అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక
మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం
ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించు కోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు క..
కార్తీక మాస విధులు కార్తీకము బహుళార్థసాధకముగా శివ కేశవ జగన్మాతలను, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని యధాశక్తి పూజించుట
ప్రధానము. ఆసక్తి, శక్తి కలిగినవారు.... ఈ మాసమంతా దీక్ష అవలంబించడం,
మాసమంతా నక్త భోజన వ్రతమును ఆచరించటం ఉత్తమము. ఈ మాసమంతా......1) సూర్యోదయానికి పూర్వమే కార్తీకస్నానం సంకల్పయుతముగా..2) కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యలలో.3) శక్తిమేరకు శివ అభిషేకమో, ఇష్టదేవతా అనుష్ఠానమో, అర్చనో, జపమో,
పూజ నామపారాయణమో, అవశ్యం దానము అనుసరణీయమే.4) "కార్తిక్యామిందువారేతు:స్నాన దాన జపాదికం |అశ్వమేధ సహస్రాణాం ఫలం ..
కార్తీకమాసం విశిష్టత : ప్రాతఃకాల స్నానదానాదులతో - కార్తీక స్నానాలు ప్రారంభం♪. కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది♪. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి,
అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం♪. ఈ మాసంలో వచ్చే... ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన
చేసేవారికి, పుణ్యఫలం చేకూరుతుంది♪. కార్తీక మాసం మొత్తం మీద
- కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది♪. అందుకే ఈ రెండు తిథుల్లో, వైష్ణవ సంబంధమైన పూజలు
ఎక్కువ చేస్తుంటారు♪. కార్తీకమాసం
అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే
విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడద..
కలియుగ వరదుడు అయ్యప్ప....!!ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని
మన పెద్దలు చెప్పేరు. భగవన్నామ స్మరణ చేయమని చెప్పడం సులువే కానీ ఏకాగ్రతతో, భక్తి తన్మయత్వంతో
చేయడం అంత సులువైన పనికాదు.మానవాళిలో భక్తితత్పరతను పెంచడానికి మన మహర్షులు పూజలు, భజనలు చేయమని,
తరచు దేవాలయాలకు, పుణ్యతీర్ధాలకు వెళ్ళమని ఆదేశించారు.దైవభక్తిని పెంపొదించడానికి కొన్ని రకాల దీక్షలను ప్రతిపాదించి,
భక్తితో దీక్ష చేసి యాత్రలకు వెళ్ళమన్నారు.దీక్షాకాలంలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పి భక్తి శ్రద్ధలతో
కనీసం మండలకాలం (41 రోజులు) దీక్ష చేసి యాత్రకు వెళ్ళి రమ్మన్నారు.దీక్షలన్నిటిలో స్వామి అయ్యప్..
ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము.
ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉన్నది.ర్యాలి రాజమండ్రి
కి 40 కి.మి., కాకినాడ కు 74 కి.మి., అమలాపురం కి 34 కి.మి. దూరం లో వసిష్ఠ, గౌతమి
అనే గోదావరి ఉప పాయ ల మధ్య కలదు. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ
ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారి కి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం.స్థల పురాణంజగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలిశ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు
దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని
..
ప్ర: చండీసప్తశతి ఉగ్రదేవతకు సంబంధించినది కదా! అలాంటి దేవతల్ని ఆరాధించడం సమంజసమేనా? జ: చండీసప్తశతిలోని దేవి ఉగ్రదేవతకాదు. సర్వశక్తిమయి, సర్వదేవతాత్మిక. కేవలం సాత్త్విక శక్తులైన దేవతలను రక్షిస్తూ, ముల్లోకాలకు క్షేమాన్ని కలిగించే జగన్మాత. శక్తియొక్క తీవ్రత చండి . ఇది దుష్టత్వాన్ని దునుమాడే పరమేశ్వరీ స్వరూపం. ఇదే చండీసప్తశతికి 'దేవీమహాత్మ్యం' అనేది అసలుపేరు. లక్ష్మి, గౌరి, సరస్వతి అనబడే సౌమ్యదేవతా రూపాలు కూడా ఆ పరాశక్తి మూర్తులే. సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే, యాని చాత్యంత ఘోరాణి తైరక్షాస్మాన్ తథా భువమ్| "అమ్మా! ముల్లోకాలలో ..
నవకైలాస క్షేత్రాలు చూశారా? హిందూ ధర్మంలో తొమ్మిదికి విశిష్ట స్థానం ఉంది. నవగ్రహాలు, నవ నందులు, నవ తిరుపతులు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు తొమ్మిది అంకెతో ముడిపడి ఉన్నాయి. అదే విధంగా నవ కైలాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవ కైలాస క్షేత్రాల్లో ప్రధాన దైవం ఆ పరమశివుడే. జీవితంలో ఒక్కసారైనా ఈ నవ క్షేత్రాలను సందర్శిస్తే, మోక్షం ఖచ్చితమని శైవధర్మాన్ని అనుసరించే వారి నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ నవ కైలాస దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టతలు ఏమి, తదితర వివరాలన్నీ మీ కోసం..ఈ నవ శైవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షమే.ఈ నవ కైలాస క్షేత్రాలకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం అగస్త్య మహాముని వ..
లలితా
సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూర్.తిరువారూర్ జిల్లాలో మైలాడుదురైకి 12 కి.మీ దూరంలో తిరుమీయచ్చూరు ఉంది. మైలాడుదురై నుంచి బస్సు సౌకర్యం ఉంది. పేరాలం నుంచి 2. కి.మీ, తిరువారూరు నుండి 25 కి.మీ, కుంభకోణం నుంచి 33 కి.మీ దూరంలో ఉన్న తిరుమీయచ్చూర్కి బస్సు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు.తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది...
సాధారణంగా దేవతార్చనలో మనం ఏదేవతను ఆరాధించినా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన అన్నది విశేషంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక ఆంతర్యాలున్నాయి. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము. ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఈనామాలన్నీ అర్థం చేసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నిబద్ధించి ఋషులు అందించారు. నామాల అర్థాలన్నీ కూడా మేళనం చేసి మనం చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది. అందుకు ఈ నామాలను ఋషులు అందించారు. అంతేకాదు సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఇవి రెండూ అనంతత్త్వాన్ని తెలియజేసేటటువంటి నామాలు. అనంతమ..
ఈరోజు
అట్ల తద్ది 19/10/2024సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్..
ఆశ్వియుజ పూర్ణిమ :
ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చం..
అక్టోబరు 17న సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలుసత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా అక్టోబరు 17వ తేదీన ఉదయం 7.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాల..
తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్ సవారి”తిరుమల, 2024 అక్టోబరు 13: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశ..
ధర్మరాజు దుర్గాస్తుతిపాండవుల వనవాసము పూర్తయి అజ్ఞాత వాసము చేయడానికి విరాటనగరం పొలిమేర
చేరారు. ధర్మ రాజు ఆయుధాలను శమీ వృక్షముపైన భద్రపరచమని తమ్ములకు సూచించాడు. అజ్ఞాత
వాసం విజయవంతంగా పూర్తిచేసి తమ రాజ్యాన్ని తిరిగి పొందేలా వరమీయమని దుర్గాదేవిని స్తుతించాడు
ధర్మరాజు.పశు ప్రవృత్తిని రూపుమాపి ధర్మ స్థాపన చేయుటకు ఈ విశ్వం లో సనాతన
స్త్రీ శక్తి మూర్తి అయిన దుర్గాదేవి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సోదరులు, ద్రౌపది
ముకుళిత హస్తాలతో ధర్మరాజును అనుసరించగా దుర్గామాతను ఈవిధంగా స్తుతించారు.చతుర్భుజే చతుర్వక్రేపీనశ్రోణి పయోధరే|మయూర పింఛవలయే కేయూరాఙ్గద ధారిణి||భాసిదేవి యథా పద్మానారాయణ పరిగ్రహః||స్వరూపం బ్..