Devotional Articles

బ్రహ్మ ముహూర్తం విశిష్టతనలుబై ఎనిమిది నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేల్కోని, తమతమ పాఠ్యాంశాలను అధ్యాయనము చేయుట చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ సమయాన్నే బ్రహ్మ ముహూర్తమని అంటారు. కాని పెద్దల మాటను ఈ విషయంలో చాల మంది పిల్లలు పెడచెవిన పెడతారు.ఇందులోని వాస్తవమేమిటంటే , ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటబట్టి గుర్తుంటుంది. ఒక పరిశోధనా సంస్థ విధ్యలో వెనకబడటంపై అధ్యాయనం జరిపి అలాంటి విధ్యార్థులు బ్రహ్మ ముహూర్తమున చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్థారించారు.సూర్యోదయానికి నలుబై ఎనిమిది నిమిషాలకు ముందు బ్రహ్మ ముహూర్తము ప్రారంభమవుతుంది. ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీ దేవి యొక్క పతి పేరు పెట్టడం జర..
జలదానం సనాతనధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఉగాది నుంచి వర్షఋతువు వచ్చేవరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రవచనం. అదే సంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అసలు జలదానానికున్న ప్రాముఖ్యత ఏమిటి? జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? దీని గురించి పురాణం ఏం చెప్తోంది.#జలదానం ప్రాముఖ్యత గురించి స్కాందపురాణంలోని ఒక కధ ఉంది.హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అన్ని ఉన్నాయో, సాగరంలో నీటిబిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు క..
హిరణ్యకశిపుడుని చంపడానికి స్వామి స్తంభం నుండి ఆవిర్భవించిన స్థలం......ప్రహ్లాద వరదుడు శ్రీ  ఉగ్రనరసింహ స్వామి ఆలయం : అహోబిలం ( శింగవేళ్ కుండ్రం)  స్థలపురాణం శ్రీ వేంకటేశ్వరుడు దిగువ అహోబిలానికి వేంచేసి స్వామిని ప్రతిష్ఠించి వివాహం చేసుకున్నాడు కావున ఈనాటికి శ్రీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం వారు పట్టు పీతాంబర వస్త్రములు అహోబలేశ్వరునికి ప్రతి సంవత్సరం సమర్పిస్తున్నారు. ఆది శంకరాచార్యుల వారు "పరకాయ ప్రవేశం" చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసింహ స్వామిని "కరావలంబ స్తోత్రము" చేయగా ఆయన చేతులు తిరిగి వచ్చినవి. ఈ స్తోత్రము "20" ..
#మరకతశ్రీలక్ష్మీగణపతిస్తోత్రం1) వరసిద్ధి సుబుద్ధి మనో నిలయం| నిరత ప్రతిభా ఫలదాన ఘనం|పరమేశ్వర మాన సమోదకరం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||2)అణిమాం మహిమాం గరిమాం లఘిమాం| ఘనతాప్తి సుకామ వరేశ వశాన్|నిరత ప్రదమ క్షయ మంగళదం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||3)జననీ జనకాత్మ వినోదకరం| జనతా హృదయాంతర తాపహరం|జగదభ్యుదయాకర మీప్సితదం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||4) వరబాల్య సుఖేలన భాగ్యకరం| స్థిరయౌవన సౌఖ్య విలాసకరం|ఘనవృద్ధ మనోహర శాంతికరం| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ ||5)నిగమాగమలౌకికశాస్త్రనిధి| ప్రదదానచణం గుణగణ్యమణిమ్|శతతీర్థ విరాజిత మూర్తిధరమ్| ప్రణమామి నిరంతర విఘ్నహరమ్ || 6) అనురాగమయం నవరాగ యుతం|గుణరాజిత నామ విశేషహితం..
*టిటిడి బ్రేకింగ్ న్యూస్ :-* తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం మార్చి 24 నుండి అమలుతిరుమల, 2025 మార్చి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానుంది.ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. (సోమ, మంగళవారం దర్శనాలకు గాను) అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, ..
ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలుతిరుపతి, 2025 మార్చి 14: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.వాహనసేవల వివరాలు :తేదీ03-04-2025ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),రాత్రి – గజవాహనం04-04-2025ఉదయం – ముత్యపుపందిరి వాహనం,రాత్రి – హనుమంత వాహనం05-04-2025ఉదయం – కల్పవృక్ష వాహనం..
తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి తిరుమల, 2025 మార్చి 11:  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తెప్పపై విహరించారు.ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పె..
   తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి..ప్రతీక.  1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని  తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాము, అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది. అందుకే మొదటి కొండకి..శేషాద్రి అని  పేరు.  2.  ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని  తాకుతుంది,  ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స..
గత జన్మలో కర్మల ఫలితం ఈ జన్మలో ఉంటుందని అంటారు. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుందనేది పండితుల వ్యాఖ్య. బియ్యం దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి. అయితే, నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు చేకూరి కోరిన కోర్కెలు తీరుతాయి. రవి గ్రహ దోషం ఉంటే గోధుమలను దానం చేసి, కెంపు పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. గురు గ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి కందులు, బుధుడిక పెసలు, శుక్రుడికి అలసందలు, రాహువుకి మినుములు, కేతువుకు ఉలవలు, శనికి నువ్వులను దానం చేయ..
మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి.1. ఆత్మప్రదక్షిణ: సాదారణంగా ఇంట్లో ఏదైన వ్రతం లేక పూజ చేసిన తరువాత:  మనచుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణాపథం లేనప్పుడు ఒకేచోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది.2. పాదప్రదక్షిణ: సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాపథంలో గానీ, ఆలయం చుట్టుగాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది.3. దండ ప్రదక్షిణ: ప్రదక్షిణాపథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి, అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగనమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయడాన్ని దండప్రదక్షిణ అనంటారు. ఈ పద్ధతిలో నాలుగుదిక్కులలోగానీ, లేక నాలుగుద..
 20 ఫిబ్రవరి 2025 ️   కాలాష్టమి, శబరి జయంతి గురువారం గ్రహ బలం పంచాంగం గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి).  గురువు యొక్క అధిష్టాన దైవం "శ్రీ ఇంద్రుడు" మరియు "శ్రీ దక్షిణామూర్తి". గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం ఇంద్రాయ నమః ||3. ఓం దక్షిణామూర్తయే నమః || 4. ఓం విష్ణవే నమః || 5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః || శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో  కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి.  దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు,..
మాఘమాసం - విశేష తిథులు మాఘ విశిష్టతను గురించి.... మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ  నవమి వరకు - శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకోవడం ఆనవాయితీ.  మాఘమాసంలో ..... శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.  శుద్ధ చవితి న ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి, గొప్ప పుణ్యఫలం చెప్పారు.  శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు.  ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతి కామదహనోత్సవం అనే పేర..
మాఘ పూర్ణిమ ప్రత్యేకత ?చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది.కార్తీక మాసం దీపాలకూ, దీపారాధనలకు ప్రసిద్ధి.మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి."మా - అఘం'' అంటే పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.    "మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ    బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే''"ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే, అనగా ... బ్రాహ్మీముహూర్తమునుంచి జలములన్నియు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టిమానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును'' అని అర్థం.అందుకనే మాఘమాసం నెలరోజులు పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు...
 కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్ష మవుతారు???నాగసాధువులకి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం!!హరిద్వార్ లోనూ,  త్రివేణి సంగమం లోనూ, ఉజ్జయిని లోను, నాసిక్ లోను జరిగే కుంభమేళా లలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీల్ల, పేపర్ లలో చూశాం. నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి..
Showing 1 to 14 of 1988 (142 Pages)