Lakshmi Gavvalu (Cowrie) (For 9 pieces)

Lakshmi Gavvalu (Cowrie) (For 9 pieces)

Availability: 840
Price :
₹225.00
Product Code: EPS-LG
+

Not Returnable
Return Policy : Return Policy is only applicable in-case of any damage caused by us.
Delivered in : Your order can be delivered in 3 to 5 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-9014126121,   +91 7731881113

Lakshmi Gavvalu Or Cowrie 

Lakshmi Gavvalu Or Cowrie, Which Represents Sri Maha Lakshmi, Which Are In Yellow - White Colour. For Better Result Lakshmi Gavvalu Is Kept In Home To Give Wealth Happiness, Unity And Prosperity. And This Gavvalu Can Be Kept At The Locker, Wardrobe, Shirt Pockets, Hand Bags, Cash Box For Good Result. Lakshmi Gavvalu Can Be Worshiped By Placing Gavvalu At The Main Entrance And Also Worshiped At Your Pooja Mandir.

లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత

పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపురంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీ గవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధ్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా గవ్వలతో అనుబంధం ఉంది. పరమేశ్వరుడికి చేసే అష్టాదశ అలంకారాలలో గవ్వలు కూడా ప్రధానంగా చోటుచేసుకుంటాయి. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి.  కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.

లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ...

 చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు.

 వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు.

 భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి.

 కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే  లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం.

 పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది.

 డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది. 

 వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి.

 వివాహ సమయామలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది.

 గవ్వలు శుక్ర గ్రహానికి సంబంధించినది కావడంతో కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు.
 వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్ఠం.

ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగలు ఉన్న చోట శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good